కలువలు / Water Lily
From LTRC
| కలువలు / Water Lily | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Angiosperms |
| Class | Magnoliopsida |
| Order | Nymphaeales |
| Family | Nymphaeaceae |
| Genus | Nymphaea |
| Scientific Name / Latin Name | నింపియా స్టెల్లాట విల్లిన్చో (Nymphaea stellata) |
కలువ నీటిలో పెరిగే క్షపము [అనగా క్షీపము/జల మొక్క]. ఈ మొక్కదేశమంతటా మంచి నీటి చెరువులలో, గుంటలలో పెరుగుతుంది. కలువ లేతాకులను, పువ్వులను, వేర్లను మరియు గింజలను శాఖం (కూర) చేసుకొని భుజిస్తారు. గింజలను పచ్చిగా కూడా భుజిస్తారు. ఇవి చలువచేస్తాయి తాపమును పోగొడతాయి. కలువ మధుర తిక్త కషాయములను శీతవీర్యము, లఘు స్నిగ్ధపిచ్ఛల గుణములతోపాటు మధురవిపాకము కలిగి ఉంది. ఇది త్రిదోషహరము, దాహప్రశమనము, గ్రాహి, మూత్రవిరజనీయము మరియు మేధ్యకర్మలను కలిగి ఉంది. దీనిని దాహము, తృృష్ణా, రక్తపిత్తము, జ్వరములలో వాడుదురు.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం: కుముద
- హిందీ: కోయా
- తెలుగు: కలువలు
- లాటిన్: నింపియా స్టెల్లాట విల్లిన్చో
- కుటుంబము: Nymhageaceae
పోషక విలువలు
- **కలువ గింజల్లో (per 100g/specified metric):**
- తేమ: 5.40 %
- కొవ్వు: 1.30
- ప్రొటీన్లు: 11.31
- కార్బోహైడ్రేట్లు: 70.59
- ఫైబర్: 7.45
- బూడిద: 3.95% ఉన్నాయి.
- **కలువ దుంపల్లో:**
- తేమ: 4.20%
- కొవ్వు: 0.45%
- ప్రొటీన్లు: 14.56%
- కార్బోహైడ్రేట్: 67.49
- ఫైబర్ (నార): 5.45
- బూడిద: 7.85 %లో ఉన్నాయి.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- (ప్రస్తుత పుస్తక పేజీలలో ప్రత్యేక ఉపయోగాలు ఉపశీర్షికలుగా ఇవ్వబడలేదు, పై పరిచయ భాగంలో గుణాలు పేర్కొనబడ్డాయి)*
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 409-410)
- రచయిత: డా|| టి. భిక్షపతి
