కర్బూజ పండు / Muskmelon

From LTRC
కర్బూజ పండు / Muskmelon
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Cucurbitales
Family Cucurbitaceae
Genus Cucumis
Scientific Name / Latin Name కుకుమిస్ మిలో (Cucumis melo)

వేసవిలో మనకు లభ్యమయ్యే పళ్ళలో కర్బూజ పండు ఒకటి. ప్రతి 100 గ్రాముల కర్బూజాలో విటమిన్ - ఎ 2400 I.U ఉన్నాయి. కర్బూజ చాలా రుచిగా ఉంటుంది. ఇది మూత్రలంగా (Diuretic) గానే కాకుండా చక్కని విరేచనాన్ని కలుగజేస్తుంది మూత్రం కష్టంగా వెదలటంను తగ్గిస్తుంది. దీనిని తినటం వలన స్త్రీలకు పాలు ఎక్కువగా పడతాయి. కర్బూజ గుండెకు మంచిది. దీనిని బెల్లంతో కలిపి తింటే చర్మవ్యాధులలో ఉపశమనం కలుగుతుంది.

కర్బూజాను తేనెతో లేదా మిరియాల పొడితో తినటం చాలా మంచిది.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: కర్బూజ
  • హిందీ & ఉర్దూ: ఖర్బూజ
  • లాటిన్: కుకుమిస్ మిలో
  • కుటుంబము: Cucurbitaceae

పోషక విలువలు

  • ప్రతి 100 గ్రాముల కర్బూజాలో విటమిన్ - ఎ 2400 I.U ఉన్నాయి.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • చర్మం ముడతలు పడకుండా: కర్బూజ చర్మాన్ని తీసి నీళ్ళతో మెత్తగా నూరి దానిని ముఖంనకు పட்டிస్తే ముడతలు తొలగిపోతాయి.
  • సంభోగ శక్తికోసం: కర్బూజ గింజలు సంభోగ శక్తిని పెంచుతాయి. దీనిని తినటం వలన అధికంగా ఉన్న యూరిక్ ఆసిడ్ తగ్గుతుంది. కర్బూజ గింజలు, పాలు తేనె, ఖర్జూరములు కలిపి సేవించిన వీర్యము చిక్కబడుతుంది. సంభోగ కోరిక పెరుగుతుంది. మంట మొదలగునవి తగ్గుతాయి.
  • ముఖ సౌందర్యం & ఫ్రెష్‌నెస్: కర్బూజ గుజ్జుగా చేసి ముఖంనకు మెడకు పట్టించి 1 గంట తర్వాత కడిగి వేస్తే చాలా ఫ్రెష్‌గా హోయిగా ఉంటుంది. ముఖ సౌందర్యము ఇనుమడిస్తుంది. దీనిని ప్రతి నిత్యం వాడటం వలన మొటిమలు తొలగిపోతాయి. ముడతలు తగ్గిపోతాయి. ముఖం గరుకుతనంపోయి సున్నితత్వము చోటుచేసుకుంటుంది. అందము పెరిగి అతి తక్కువ వయస్సు కల వారిగా కనిపిస్తారు.
  • శరీర మంటలు & మూత్ర సమస్యలు: ఖీరాదోస రసాన్ని కాళ్ళకు, చేతులకు రాస్తే మంటలు, తిమ్మిర్లు తగ్గుతాయి. నేల గుమ్మడి, కీరదోస గింజలు, చెటుకు రసము కలిపి త్రాగితే మూత్రం సాఫీగా అవుతుంది. దీని Renal calculi (Reval calculi) రోగులకు చాలా మంచిది.
  • మూత్రంలో రక్తస్రావం మరియు మంట: ఖర్బూజ మరియు ఖీరా దోస గింజలు, కొద్దిగా ఉసిరికాయ రసము మరియు గులాబీ రేకులను కలిపి ఒకవారం రోజులు క్రమంగా వాడితే మూత్రంలో రక్తం పడటం మూత్రంలో మంట తగ్గుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 415-416)
  • రచయిత: డా|| టి. భిక్షపతి