కమలాఫలము / Orange

From LTRC
కమలాఫలము / Orange
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Magnoliopsida
Order Sapindales
Family Rutaceae
Genus Citrus
Scientific Name Citrus sinensis (L.) Osbeck

తియ్యగా, పుల్లగా ఉండి తిన్న వెంటనే తృప్తిని కలిగించేది కమలాఫలము. కమలాఫలరసమును త్రాగిన వెంటనే ఉత్సాహము ఇనుమడిస్తుంది. శక్తి పుంజుకుంటుంది. ఆరెంజ్ కమలాఫలము పైత్యాన్ని తగ్గిస్తుంది. తలత్రిప్పటం, దప్పికలను తగ్గిస్తుంది. కమలాఫలాల రసాన్ని త్రాగటం మరియు తినడం వలన పయోరియా చిగుళ్ళవ్యాధి రాకుండా ఉంటుంది. కమలాఫలము యొక్క జ్యూస్ ఎండ వేడిమిని తగ్గిస్తుంది.

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల ఆరెంజ్‌లో ఉండే పోషక విలువల వివరాలు:

  • తేమ: 87.8%
  • కార్బోహైడ్రేట్లు: 10.6 మి.గ్రా
  • ప్రోటీన్లు: 0.9 మి.గ్రా
  • క్రొవ్వు: 0.3 మి.గ్రా
  • మినరల్ మేటర్: 0.4 మి.గ్రా
  • కాల్షియం: 0.06 మి.గ్రా
  • పాస్ఫరస్: 0.02 మి.గ్రా
  • ఐరన్: 0.1 మి.గ్రా
  • విటమిన్ - ఎ: 350 I.U
  • విటమిన్ - బి: 40 I.U
  • విటమిన్ - సి: 60 మి.గ్రా

సౌందర్య సాధనం కమలాఫలము

  • మొటిమలు: కమలాఫలం తొక్కులను (పై చర్మము) (Peels) ఎండబెట్టి చూర్ణం చేసి అందులో చందనము, పసుపు కలిపి రాసిన మొటిమలు తగ్గుతాయి.
  • చర్మ సంరక్షణ: చర్మం కాంతివంతమౌతుంది. జిడ్డు తొలగుతుంది. చర్మము సున్నితంగా, కోమలంగా తయారవుతుంది. చర్మము ముడతలు పడటం తగ్గుతుంది.
  • ఫేషియల్: ఇన్ని ఉపయోగాలున్న కమలా ఫలము యొక్క చర్మాన్ని (Skin) లేక తొక్కులను పారవెయ్యకండి. దీనిని భద్రపరచి Facial కోసం వాడండి!

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 397, 398)
  • రచయిత: డా|| టి. భిక్షపతి