కంద దుంపలు / Elephant Foot Yam

From LTRC
కంద దుంపలు / Elephant Foot Yam
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Liliopsida
Order Alismatales
Family Araceae
Genus Amorphophallus
Scientific Name Amorphophallus paeoniifolius (Denst.) Nicolson

భారతదేశంలో అనేక ప్రాంతాల్లో దీనిని పండిస్తున్నారు. అనేక ఔషధ విలువలు కలిగిన కంద ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. ఇది చాలా కాలము నిలువ ఉంటుంది. కంద కటు కషాయరసములు ఉష్ణవీర్యము లఘు రూక్షతీక్ష్ణగుణములు మరియు కటువిపాకములను కలిగి ఉంది. దీనిని ముఖ్యంగా అర్షములు, కడుపులో గడ్డలు, దగ్గు, ఆస్త్మా, క్రిములు, నొప్పి మరియు ప్లీహం పెరుగుట అనే వ్యాధులందు ఉపయోగిస్తారు. ఇది కఫవాతశామకము, దీపన, పాచన, కర్మలను కలిగి ఉంది. దీనిని అర్షమొలలు, గుల్మము, శూల, శ్వాస, కాస, ప్లీహోదరములందు వాడుదురు.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: కంద దుంప
  • సంస్కృతం: సూరణ
  • హిందీ: ఓల
  • లాటిన్: అమోర్ ఫోపాలస్ కంపానొల్లేటస్ బ్లూమ్ (Amorphophallus campanulatus)
  • కుటుంబము: Araceae

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల కందలో ఉండే పోషక విలువల వివరాలు:

  • కేలరీలు: 79 గ్రాములు
  • క్రొవ్వు: 0.1 గ్రా
  • ఖనిజలవణములు: 0.8 గ్రాములు
  • ప్రోటీన్లు: 1.2 గ్రా
  • ఫైబర్ (నార): 0.8 గ్రాములు
  • తేమ: 78.7 గ్రా
  • ఇనుము (ఐరన్): 0.6 గ్రాములు
  • కాల్షియం: 50 మి.గ్రా
  • పాస్పరస్: 34 మి.గ్రా
  • విటమిన్ - ఎ: 434 ఆం.యూ
  • థైమిన్: 0.06 మి.గ్రా
  • రైబోఫ్లేవిన్: 0.07 మి.గ్రా
  • నికోటినిక్ యాసిడ్: 0.7 గ్రాములు

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • అర్షమొలలు (మొలలు):
  1. అడవి కంద లేదా కంద దుంపలను శుభ్రంగా కడిగి చక్కగా తరిగి ఎండించివాటిని జాగ్రత్తగా కొద్దిరోజులు నిల్వచేయాలి. తర్వాత దీని చూర్ణము 3-5 గ్రాములు వాడితే మొలల్లో ఎంతో ఉపయోగకరం.
  2. అన్నమును భుజింపక కేవలం కందదుంపను కూరగా చేసుకొని మజ్జిగ అనుపానముతో ఒక నెల రోజులు సేవించిన అర్షమొలలు తగ్గుతాయి.
  3. కందదుంపల్ని ఉడికించి దానిని మెత్తగా దంచి నెయ్యిలో వేయించి తర్వాత బెల్లం పాకం పట్టుకొని 10-20 మి.లీ. చొప్పున రెండుపూటలు తినిన యెడల మొలలు రాకుండా ఉంటాయి.
  • శ్లీపదము (బోదకాలు): బాగా పండిన కందదుంపను నీళ్లతో మెత్తగా నూరి అందులో శుంటిని కలిపి దానిని పైపూతగా రాస్తున్న గ్రంధులు తగ్గుతాయి. బోదకాలు నందు కందదుంపను మెత్తగా నూరి అందులో తేనె, నెయ్యి కలిపి పట్టువేస్తే బోదకాలు వాపు తగ్గుతుంది.
  • కడుపులో పాములు: కందదుంప కూరగా చేసుకొని తినటం వలన కడుపులో పాములు పెరగవు. వాతము తగ్గుతుంది. శరీరం కూడా తేలికగా ఉంటుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 380, 381)
  • రచయిత: డా|| టి. భిక్షపతి