ఉసిరికాయ / Amla

From LTRC
ఉసిరికాయ / Amla
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Magnoliopsida
Order Malpighiales
Family Phyllanthaceae (Euphorbiaceae)
Genus Phyllanthus
Scientific Name Phyllanthus emblica L.

ఉసిరికాయ చెట్టుకు ఎంతో పవిత్రత ఉంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు క్రింద భోజనం చేయటం తెలుగువారి అలవాటు. ఉసిరికాయ యందు మధు, ఆమ్లకటు తిక్త కషాయరసములు ఉన్నాయి. ఇది త్రిదోషహరము, చక్షుష్యము, వృష్యము, వయః స్థాపనము మరియు రసాయన కర్మలను కలిగిఉంది. ఉసిరిని మధుమేహం, చర్మవ్యాధులు, అతిసారము, అర్షములు, కడుపునొప్పి, తెల్లబట్ట, రక్త ప్రదరము లేదా ఎర్రకుసుమ, మూత్రం కష్టంగా వెడలడము మరియు నేత్రవ్యాధులందు ఉపయోగిస్తారు.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: ఉసిరికాయ
  • సంస్కృతం: ఆమలకీ
  • హిందీ: ఆంవలా
  • లాటిన్: ఫిల్లాంథిస్ ఎమ్బ్లికా లిన్నెయస్ (Phyllanthus emblica)
  • కుటుంబము: యుపర్బియేసి (Euphorbiaceae / Phyllanthaceae)

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల ఉసిరి యందు ఉండే పోషక విలువల వివరాలు:

  • తేమ: 81.2%
  • ప్రోటీన్లు: 0.5 మి.గ్రా
  • క్రొవ్వు: 0.1%
  • మినరల్ మేటర్: 0.7 మి.గ్రా
  • ఫైబర్ (నార): 8.4 మి.గ్రా
  • కార్బోహైడ్రేట్: 14.1 మి.గ్రా
  • కాల్షియం: 0.5 మి.గ్రా
  • పాస్పరస్: 0.02 మి.గ్రా
  • విటమిన్ - సి: 750 మి.గ్రా

ఉసిరిలో విటమిన్ - సి ఎక్కువగా ఉంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరిలో పెక్టిన్ ఉంది, ఇది విరేచనాలను తగ్గిస్తుంది. ఉసిరి పండ్లలో గాలిక్ ఆసిడ్, టానిక్ ఆసిడ్ మరియు ఐరన్‌లు కూడా ఉన్నాయి.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • మధుమేహము: పసుపు మరియు ఉసిరిక చూర్ణములను సమంగా కలిపి భోజనానికి అరగుంట ముందు రాత్రి భోజనానికి అరగుంట ముందు సేవించిన మధుమేహము అదుపులో ఉంటుంది.
  • మూత్రం కష్టంగా వెడలటము: ఉసిరి పండ్ల రసము, తేనె, కలకండార కలిపి సేవించిన మూత్ర కృచ్ఛము తగ్గును. ఇది శుక్రమును వృద్ధి చేస్తుంది. రక్తపిత్తము, మంట, దదుర్లు మొదలగువానిని కూడా తగ్గిస్తుంది.
  • ముసలితనం రాకుండా: ఉసిరి రసాయన గుణము కలిగి ఉంది. ఉసిరి సేవించటం వలన ముసలి తనం రాకుండా శరీరం దృఢంగా ఉంటుంది. పెద్దవాళ్లకు ప్రతిరోజు 75 గ్రాముల విటమిన్ - సి అవసరమౌతుంది.
  • అర్షమొలలు: ఉసిరి పండ్ల చూర్ణంతో పాటు కరక్కాయ తానికాయ (త్రిఫలా) చూర్ణములను కలిపి సేవించిన విరేచనము సాఫీగా అయి అర్షమొలలు రోగులకు ఉపశమనం కలుగుతుంది. మలబద్ధకము కూడా తొలగుతుంది.
  • దృష్టిలోపము: ఉసిరిని సేవించటం వలన కంటి చూపు మెరుగవుతుంది.
  • రోగనిరోధక శక్తి తోపించుట మరియు ఎయిడ్స్: ఉసిరి, అశ్వగంధ, శతావరి, పిప్పళ్ళ మూలము మరియు నేల తాడి గడ్డలను కలిపి ప్రతిరోజు సేవించిన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • అలసట తొలుగుటకు: ఉసిరి చూర్ణమును సేవించిన పనివత్తిడి వలన పడ్డ శ్రమ తొలుగుతుంది.
  • తలనొప్పి: తలనొప్పిగా ఉన్న యెడల ఉసిరి చూర్ణము మరియు శుంటి కలిపి పట్టువేసిన తలనొప్పి తగ్గుతుంది.
  • చర్మ సౌందర్యానికి: పసుపు, చందనము, ఉసిరి మరియు పెసర పిండి, కచ్చూరాలు కలిపి చూర్ణము చేసి స్నానం చేస్తే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఫ్రెష్‌గా ఉంటుంది. చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది.
  • అధిక సంభోగశక్తి కోసము: ఉసిరి పండ్ల చూర్ణమును ఉసిరి పండ్ల రసములో నానవేసి పంచదార, నెయ్యి, తేనె చేర్చి దానిని పాలతో తిన్నయెడల సంభోగశక్తి బాగా పెరుగుతుంది.
  • జట్టు నిగనిగలాడుటకు: ఉసిరి పండ్ల చూర్ణము నందు నిమ్మరసం కలిపి అందులో గుంటగలగరాకు కూడా కలిపి తలకు రాసుకుంటే జుట్టు నిగనిగలాడుతుంది. కేశములు ఒత్తుగా పెరుగుతాయి.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 367, 368, 369)
  • రచయిత: డా|| టి. భిక్షపతి