ఉల్లిపాయలు / Onion
From LTRC
| Scientific Classification | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophyta |
| Class | Liliopsida |
| Order | Asparagales |
| Family | Amaryllidaceae (Liliaceae) |
| Genus | Allium |
| Scientific Name | Allium cepa L. |
ఈ మొక్కను భారతదేశంలో సమశీతోష్ణ ప్రదేశాలలో పండిస్తారు. ఉల్లిపాయలు ఉండని ఇల్లు ఉండకపోవచ్చు. సలాడ్‌లో, కూరల్లో ఉల్లిపాయలు అవసరం ఎంతో. ఇది మధుకటు రసం, అనుష్ణవీర్యము, గురు తీక్ష్ణ స్నిగ్ధ గుణములను మరియు మధుర విపాకమును కలిగి ఉంటుంది. ఇది వాత హరము, శ్లేష్మకరము, దీపనము, బల్యము, వృష్యము మరియు రసాయన కర్మలను కలిగి ఉంది. ఉల్లిపాయను అగ్ని మాంద్యము, అర్షములు, మధుమేహము, రక్తపిత్తము మొదలగు వ్యాధుల్లో ఉపయోగిస్తారు. శరీరంలోని అవయవాలన్నింటిని ఉత్తేజితం చేసే గుణము ఉల్లికి ఉంది. ఉల్లిపువ్వుల రసానికి బ్యాక్టీరియాలను సంహరించే గుణముంది.
వివిధ భాషల్లో పేర్లు
- తెలుగు: ఉల్లిపాయ
- సంస్కృతం: పలాండు
- హిందీ: ప్యాజ్
- లాటిన్: ఆలియమ్ సెఫా లిన్నెయస్ (Allium cepa)
- కుటుంబము: లిలియేసి (Liliaceae / Amaryllidaceae)
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల ఉల్లిపాయల్లో ఉండే పోషక విలువల వివరాలు:
- తేమ: 86.8%
- ప్రోటీన్లు: 1.2 మి.గ్రా
- క్రొవ్వు: 0.1 మి.గ్రా
- కార్బోహైడ్రేట్లు: 11.6%
- కాల్షియం: 0.18 మి.గ్రా
- పాస్పరస్: 0.05 మి.గ్రా
- విటమిన్ - ఎ: 25 యూనిట్స్
- విటమిన్ - బి: 40 యూనిట్స్
- విటమిన్ - సి: 11 మి.గ్రా
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- మూర్ఛరోగాలకు: 3-4 చుక్కల ఉల్లిపాయ రసాన్ని ముక్కు రంధ్రాల్లో వేసిన మూర్ఛరోగాలకు స్పృహవస్తుంది.
- మూత్రం సాఫీకోసం: ఉల్లిపాయల రసానికి మూత్రాన్ని సాఫీచేసే గుణముంది.
- మధుమేహం: మధుమేహరోగాలకు ఉల్లి ఉపయోగకరం.
- కీళ్లనొప్పులు: ఉల్లిని మెత్తగా నూరి ఆవునేయితో కలిపి కీళ్లనొప్పులు ఉన్న చోట రాసిన నొప్పి తగ్గుతుంది.
- చెవిపోటు: ఉల్లిపాయల రసాన్ని కొద్దిగా వేడిచేసి 5-6 చుక్కలు చెవిలో పోసిన (కర్ణశూల) నొప్పి తగ్గుతుంది.
- గడ్డలు: శరీరంలో ఏ భాగంలోనైనా గడ్డలు లేస్తే దానిపై కొద్దిగా నెయ్యి వేడిచేసి ఆ గడ్డల మీద రాసి ఉడికించిన ఉల్లిని నూరి పట్టు వేస్తే గడ్డలు మెత్తబడి పగిలిపోతాయి.
- ముక్కునుండి రక్తం కారుతుంటే: ఉల్లిపాయరసాన్ని ముక్కుల్లో వేస్తే రక్తం కారటం తగ్గుతుంది.
- వడదెబ్బ: వడదెబ్బతో బాధపడే రోగులకు ఉల్లిపాయల రసాన్ని కణతల పై, ఛాతీపైన రాస్తే వడదెబ్బ వలన ఉపశమనం కలుగుతుంది.
- అల్బుమిన్ మూత్రంలో కనిపిస్తే: నీరుల్లి రసములో ఏలకుల పొడి కలిపి త్రాగితే అల్బుమిన్ ఎక్కువగా పోవటం తగ్గుతుంది. ఉల్లిపాయ రసములో పంచదార కలిపి త్రాగితే చలువుచేస్తుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 370, 371)
- రచయిత: డా|| టి. భిక్షపతి
