ఈతచెట్టు / ఈతపండు / Phalsa
From LTRC
| Scientific Classification | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophyta |
| Class | Magnoliopsida |
| Order | Malvales |
| Family | Tiliaceae |
| Genus | Grewia |
| Scientific Name | Grewia asiatica L. |
ఈత చెట్లు అన్నిచోట్లా పెరుగుతాయి. మన పల్లెల్లో పంట పొలాల గట్లమీద, రోడ్ల ప్రక్కన మరియు ఖాళీ ప్రదేశాలలో ఈతచెట్లు కనబడతాయి. ఈతపండ్లు చిన్నగా ఉన్న చాలా రుచిగా ఉంటాయి.
వివిధ భాషల్లో పేర్లు
- తెలుగు: ఈతపండు
- సంస్కృతం: పరూషిక భేదము
- హిందీ: ఫాల్సా
- లాటిన్: గ్రేవియా ఏసియాటికా లిన్నెయస్ (Grewia asiatica)
- కుటుంబము: Tiliaceae
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల ఈతపండ్లలో ఉండే పోషక విలువల వివరాలు:
- తేమ: 59.2%
- ప్రోటీన్లు: 1.2%
- క్రొవ్వు: 0.4%
- కార్బోహైడ్రేట్లు: 33.8%
- ఫైబర్ (నార): 3.7%
- మినరల్ మేటర్: 1.7%
- కాల్షియం: 0.022 మి.గ్రా
- పాస్ఫరస్: 0.38 మి.గ్రా
ఇది మధురరసము, శీతవీర్యము, లఘుస్నిగ్ధ గుణము, మధురవిపాకములను కలిగి ఉంది.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- పంటినొప్పి: ఈతచెట్టు వేళ్లను కషాయంగా కాచి పుక్కిట పట్టి ఊచేసిన పంటినొప్పి తగ్గుతుంది.
- వీర్యపుష్టి & బలం: ఈతపళ్ళు వీర్యపుష్టిని కలిగిస్తాయి. క్షయరోగతులకు ఉపయుక్తంగా ఉంటాయి.
- రక్త దోషాలు: ఈతపళ్ళు దప్పికను తీరుస్తాయి. రక్త దోషాలు ఉపశమించడానికి తోడ్పడతాయి.
- యాంటీ బాక్టీరియల్ గుణాలు: చిట్టీత యొక్క Ether extract నాకు Anti-Staphylococcus & E-coli నిరోధక గుణాలు కలిగి ఉంది.
నీరా మరియు ఈతకల్లు
నీరా (Neera)
ఈతచెట్టునుండి “నీరా” అనే అతి చక్కటి స్వీట్ డ్రింక్ తీస్తారు. ఇందులో విటమిన్ - బి, ఆస్కార్బిక్ యాసిడ్స్ ఎక్కువ పాళ్లలో ఉన్నాయి. అయితే దీనిని సూర్యోదయానికి ముందే త్రాగాలి. సూర్యోదయం అయితే అది పులిసిపోయి పుల్లగా అవుతుంది.
ఈతకల్లు (Toddy / Taddy)
నీరా పులిసిన ద్రవాన్ని కల్లు లేక Toddy అంటారు.
- పోషకాలు & కాంపౌండ్స్: దీనిలో రైబోఫ్లేవిన్ ఎక్కువగా ఉంటుంది. దీనితోపాటు పాస్ఫరస్, నైట్రోజన్, గ్లిసరాలో, ఆష్, సుక్రోజ్, రెడ్డి సుగర్, యాసిడ్ మరియు ఆల్కహాల్‌లు కూడా కలవు.
- హెచ్చరిక: అదే పనిగా కల్లు త్రాగటం ఆరోగ్యానికి మంచిదికాదు. అతి ఎప్పుడూ అనర్థదాయకమే!
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 365, 366)
- రచయిత: డా|| టి. భిక్షపతి
