ఇలాచీ (ఏలా) / Cardamom

From LTRC
ఇలాచీ (ఏలా) / Cardamom
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Liliopsida
Order Zingiberales
Family Zingiberaceae
Genus Elettaria
Scientific Name Elettaria cardamomum (L.) Maton

ఇలాచీని భారతదేశము నందు మైసూర్, కూర్గ్, టూటికోరిన్ ప్రాంతములలో పండిస్తారు. ఇంకా బర్మా, శ్రీలంకలందు కూడా విశేషంగా లభిస్తుంది. తెలుగులో ఏలకులు అని పిలిచినా, తెలంగాణా ప్రాంతములో ఇలాచీ అంటేనే చాలామందికి తెలుస్తుంది. ఇలాచీని సువాసన కొరకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా నాన్‌వెజిటేరియన్లోనే కాక పాయసంలో, కేక్స్ లో, బ్రెడ్ మరియు కాఫీ, టీలలో కూడా దీనిని ఉపయోగిస్తారు.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: ఎలాక్కాయ చెట్టు
  • సంస్కృతం: ఏలా
  • హిందీ: ఇలాచీ
  • లాటిన్: ఎలటేరియా కార్డ్మోమమ్ మాటన్ (Elettaria cardamomum)
  • కుటుంబము: Zingiberaceae

పోషక విలువలు

100 గ్రాముల ఇలాచీలో ఉండే పోషక విలువలు:

  • తేమ: 20%
  • ప్రోటీన్లు: 10.2 మి.గ్రా
  • కార్బోహైడ్రేట్లు: 42.1 మి.గ్రా
  • కాల్షియం: 0.13 మి.గ్రా
  • పాస్ఫరస్: 0.16 మి.గ్రా
  • ఐరన్: 500 మి.గ్రా
  • మినరల్ మేటర్: 5.4 మి.గ్రా
  • ఫైబర్: 20.1 మి.గ్రా

ఇందులో సుగంధ తైలము, పొటాషియము మరియు మాంగనీసులు కూడా కలవు. ఇది కఫవాతహర, హృద్య, రోచన కర్మలు కలిగి ఉంది. ఇది కటు మధురరసము, లఘు రూక్ష గుణము, శీత (చిన్నయేల), ఉష్ణ (పెద్దయేల) వీర్యమును, కటువిపాకమును కలిగి ఉంది.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • కడుపునొప్పి: ఇలాచీ (ఏలకులు) మరియు అల్లం, లవంగాలతో కలిపి 125 మి.గ్రా చొప్పున 2 పూటలు వాడినా కడుపునొప్పి తగ్గుతుంది.
  • మూత్రంలో మంట: ఏలకులు మరియు ఉసిరి పండ్ల రసము కలిపి త్రాగినా మూత్రంలో మంట తగ్గుతుంది.
  • హృద్రోగము: ఇలాచీ మరియు పిప్పలీ చూర్ణము కలిపి నేతితో తీసుకున్న హృద్రోణములో ఉపయోగకరంగా ఉంటుంది.
  • నరాలనొప్పి & అజీర్ణము: ఏలకుల (ఇలాచీ) చూర్ణమును పాలతో కలిపి సేవిస్తే నరాల జబ్బులు మరియు నరాల నొప్పిలో ఉపయోగకరంగా ఉంటుంది. అజీర్ణము తొలగి కడుపుబ్బరము తగ్గుతుంది. ఇది తిమిరము నందు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
  • ఇతర ఉపయోగాలు: ఇది శుక్రనాశకము కూడా. పండు ఇప్పపండే చలువ చేస్తుంది, శుక్రాన్ని వృద్ధి చేస్తుంది. వాత పిత్తలను హరిస్తుంది. దప్పిక, రక్త సంబంధ వ్యాధులు శరీ్రమంతా ఉబ్బసములందు ఉపయుక్తం.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 362, 363)
  • రచయిత: డా|| టి. భిక్షపతి