ఆపికాట్ (Apricot)

From LTRC
ఆపికాట్ (Apricot)
శాస్త్రీయ వర్గీకరణ (Scientific Classification)
రాజ్యము (Kingdom): Plantae
విభాగము (Division): Tracheophyta
తరగతి (Class): Magnoliopsida
క్రమము (Order): Rosales
కుటుంబము (Family): Rosaceae
ప్రజాతి (Genus): Prunus
లాటిన్ పేరు: Prunus armeniaca

ఆపికాట్ (Apricot) అనేది రోజేసి (Rosaceae) కుటుంబానికి చెందిన ఒక విశిష్టమైన పండ్ల మొక్క. దీని లాటిన్ శాస్త్రీయ నామం ప్రూనస్ ఆర్మేనియాకా (Prunus armeniaca). ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ఫలం భారతదేశంలో ప్రధానంగా కాశ్మీర్ వంటి ప్రాంతాలలో పండుతుంది. ఇందులో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: ఆపికాట్
  • ఉర్దూ: ఖుబానీ
  • లాటిన్: ప్రూనస్ ఆర్మేనియాకా (Prunus armeniaca)
  • కుటుంబము: Rosaceae (రోజేసి)

పోషక విలువలు

ఆపికాట్‌లో విటమిన్ - ఎ మరియు పొటాషియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీని గుజ్జు మరియు గింజలు రెండూ ఉపయోగపడతాయి; గింజలను బాదంలాగా ఉపయోగించుకోవచ్చు మరియు ఇవి మంచి రుచిని కలిగి ఉంటాయి.

పోషకాల వివరాలు:

  • కార్బోహైడ్రేట్లు: 19 గ్రా
  • ప్రోటీన్లు: 0.6 గ్రా
  • కొవ్వు: 0.1 గ్రా
  • విటమిన్ - ఎ: 3000 I.U
  • విటమిన్ - బి: 10 మి.గ్రా
  • విటమిన్ - బి2: 0.05 మైక్రో గ్రాములు
  • ఫోలిక్ యాసిడ్: 3 మి.గ్రా
  • విటమిన్ - సి: 20 మి.గ్రా
  • పాంతోతెనిక్ యాసిడ్: 0.03 మి.గ్రా
  • క్యాల్షియం: 1.8 మి.గ్రా
  • ఫాస్పరస్: 22 మి.గ్రా
  • ఐరన్: 0.37 మి.గ్రా
  • పొటాషియం: 320 మి.గ్రా
  • సోడియం: 1 మి.గ్రా
  • సల్ఫర్: 6.1 మి.గ్రా
  • కాపర్: 1 మి.గ్రా
  • మెగ్నీషియం: 12 మి.గ్రా
  • క్లోరిన్: 0.12 మి.గ్రా

ఔషధ ఉపయోగాలు & ఆరోగ్య గుణాలు

1. జనరల్ టానిక్: ఆపికాట్‌ను తేనెతో కలిపి సేవిస్తే ఇది చాలా చక్కని Nervine టానిక్‌లా పనిచేస్తుంది. రక్తాన్ని వృద్ధి పరుస్తుంది మరియు నీరసాన్ని తొలగిస్తుంది. 2. అర్శమొలలు (Piles): దీనిని ప్రతిదినము తినడం వలన విరేచనం సాఫీగా అవుతుంది. ఇది అర్శమొలల రోగులకు ఎంతో ఉపయోగకరం. 3. వేసవికి శ్రేష్ఠం: ఆపికాట్ తాజా ఫలములతో జ్యూస్ తయారుచేసుకొని తేనె కలిపి సేవించిన దప్పిక తీరి తృప్తి కలుగుతుంది. ఇవి వేసవిలో మరియు జ్వరం ఉన్నవారికి కూడా ఎంతో ఉపయోగకరమే. 4. వ్యాధి నిరోధకత & గర్భిణీలకు: ఆపికాట్ తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరచు ఇన్ఫెక్షన్లకు గురయ్యేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. రక్తహీనత రోగులకు, గర్భిణీ స్త్రీలకు మరియు పొటాషియం తక్కువ ఉన్న వ్యక్తులకు ఇది చాలా ఉపయోగకరం. 5. క్రిమి రోగాలు & చర్మ వ్యాధులు: దీని లేత ఆకుల రసము తీసి రాస్తే గజ్జి, దురద తగ్గుతాయి. ఎండ వేడిమి వలన చర్మము కందిపోతే దీనిని రాసి ఉపశమనం పొందవచ్చు. 6. కడుపులో క్రిములు: దీనిని కషాయం కాచుకొని తాగిస్తే కడుపులోని క్రిములు నిర్మూలించబడతాయి.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 339, 340)
  • రచయిత: డా|| టి. భిక్షపతి