అశ్వగంధా / Ashwagandha

From LTRC
అశ్వగంధా / Ashwagandha
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Magnoliopsida
Order Solanales
Family Solanaceae
Genus Withania
Scientific Name Withania somnifera (L.) Dunal

అశ్వగంధా (Ashwagandha) గుర్రము యొక్క వాసన కలిగి ఉండునది. ఈ మొక్కను అనేక ప్రాంతాల్లో పెంచుతున్నారు. ఆయుర్వేద ఔషధాల్లో అశ్వగంధా అతి ముఖ్యమైనది. శక్తికీ, పుష్టికీ మరియు రసాయనానికి అశ్వగంధా ఎంతో అవసరం. ఆకలిని పెంచటానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. ఇది వాత కఫహరము, బల్యము, రసాయనము, శుక్రలము. ఇది కటు, తిక్త, కషాయ రసములు, స్నిగ్ధ, లఘు గుణములు, ఉష్ణవీర్యము మరియు కటు విపాకములను కలిగి ఉంది.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: పెన్నేరు
  • సంస్కృతం: అశ్వగంధా
  • హిందీ: అసగంధ
  • లాటిన్: విధానియ సోమ్ని ఫెరా (Withania somnifera)
  • కుటుంబము: Solanaceae

పోషక విలువలు

అశ్వగంధాలో అనేక రకాల పోషకాలు మరియు క్రియాశీలక అల్కాలాయిడ్లు కలవు:

  • పోషకాలు: ప్రోటీన్లు (ఎక్కువగా), కాల్షియం, ఫాస్ఫరస్ మరియు ఎన్నో ఫ్రీ ఎమైనో యాసిడ్స్.
  • అల్కాలాయిడ్లు: 13 రకాల ఆల్కాలాయిడ్స్ (ఉదా: విటాఫెరిన్-ఎ).
  • ఔషధ గుణాలు: విటాఫెరిన్-ఎ యాంటీబయోటిక్, యాంటీ ట్యూమర్ (Anti-tumor) గుణాలను కలిగి ఉంది. ఇది Gram+ బ్యాక్టీరియాలను, Fungus ను, Acid Fast Bacilli లను నిరోధిస్తుంది.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • పిల్లల ఎదుగుదలకు: అశ్వగంధా చూర్ణమును పాలతో / నెయ్యితో / తేనెతో కలిపి సేవించిన శరీరపుష్టి కలుగుతుంది. బలహీనత, నీరసం తొలగుతాయి. అశ్వగంధా, శతావరి, బలామూలములను కలిపి సేవించిన కూడా పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది.
  • ట్యూబర్ క్లోసిస్ (టి.బి): అశ్వగంధా, పిప్పలీ చూర్ణము కలిపి అందులో పంచదార, తేనె, నెయ్యి మొదలగు వాటిని సమానంగా కలిపి వాడితే టి.బి లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
  • చక్కని నిద్రకోసం: అశ్వగంధా చూర్ణము 3 గ్రాములు పాలల్లో కలిపి రాత్రి పడుకునే ముందు సేవించిన చక్కని నిద్ర పడుతుంది.
  • యాంగ్జైటీన్యూరోసిస్: యాంగ్జైటీతో బాధపడే రోగులు అశ్వగంధా మరియు వచ చూర్ణములను కలిపి సేవించిన యాంగ్జైటీ లక్షణాలు తగ్గిపోతాయి, చక్కగా నిద్రపడుతుంది.
  • అధిక రక్తపోటు: అశ్వగంధా చూర్ణము అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
  • జ్వరాలు: అశ్వగంధా ఆల్కహాల్ ఎక్స్‌ట్రాక్ట్‌కు జ్వరాలను తగ్గించే గుణము కలిగి ఉన్నట్లు పరిశోధనలో గమనించడమైనది.
  • గ్రంధి: అశ్వగంధి మూలకల్కమును వేడిచేసి గ్రంధిపై లేపనము చేసిన తగ్గును.
  • కీళ్లవాపు: అశ్వగంధా చూర్ణము రోజుకు 3 పూటలు సేవించిన కీళ్లు వాచి ఇబ్బంది పెట్టే రుమటాయిడ్ ఆర్థరైటీస్ నందు ఉపయోగక్తంగా ఉన్నట్లు పరిశోధనలో గమనించారు.
  • సిఫిలిస్, గజ్జి మరియు చర్మ వ్యాధులు: అశ్వగంధా ఆకులను మెత్తగా దంచి ఉపయోగించిన సిఫిలిస్ వలన ఏర్పడిన పుండు తగ్గుతుంది. ఇంకా గజ్జి, రింగ్ వార్మ్ మొదలైన వాటిలో ఉపయోగకరంగా ఉంటుంది. వంధ్యత్వము, శ్వాస మొదలైనవి తగ్గును.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 356, 357)
  • రచయిత: డా|| టి. భిక్షపతి