అల్లనేరేడు (నేరేడు) / Jamun

From LTRC
అల్లనేరేడు (నేరేడు) / Jamun
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Magnoliopsida
Order Myrtales
Family Myrtaceae
Genus Syzygium
Scientific Name Syzygium cumini (L.) Skeels

అల్లనేరేడు (నేరేడు) ఆంధ్రప్రదేశ్‌మంతటా పెంచబడుతున్న లేదా పెరిగే ముఖ్యమైన మూలికా వృక్షం. ఆహారంగానే కాకుండా ఔషధంగా దీని విలువలు చాలా ఎక్కువ. దీని గింజలు డయాబెటీస్‌ను అదుపు చేస్తాయని పరిశోధనలలో గమనించడం జరిగింది. ఇది కఫపిత్తహరము, వాతకరము, గ్రాహి, సంగ్రాహణీయము అను కర్మాచరణలు కలిగి ఉంది. దీనిని ఛర్ది (వాంతులు), అతిసారము, రక్తపిత్తము, శ్వాస, కాస, దాహము, క్రిమి, మధుమేహము నందు ఉపయోగిస్తారు.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: అల్లనేరేడు ; నేరేడు
  • సంస్కృతం: జంబూ
  • హిందీ: జామూన్
  • లాటిన్: సిజియంకుమిని తిన్న్యోయ్స్ స్కీల్స్ (Syzygium cumini)
  • కుటుంబము: Myrtaceae

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల అల్లనేరేడు పండులో ఉండే పోషక విలువల వివరాలు:

  • తేమ: 83.7%
  • ప్రోటీన్: 0.7 గ్రా
  • క్రొవ్వు: 0.3 గ్రా
  • ఫైబర్ (నార): 0.9 గ్రా
  • కార్బోహైడ్రేట్లు: 14.0 గ్రా
  • యాష్ (బూడిద): 0.4 గ్రా
  • కాల్షియం: 15 మి.గ్రా
  • మెగ్నీషియం: 55 మి.గ్రా
  • పాస్పరస్: 15 మి.గ్రా
  • ఐరన్ (ఇనుము): 1.2 మి.గ్రా
  • సోడియం: 26.2 మి.గ్రా
  • పొటాషియం: 55 మి.గ్రా
  • కాపర్: 0.23 మి.గ్రా
  • సల్ఫర్: 13 మి.గ్రా
  • క్లోరిన్: 8 మి.గ్రా
  • థైమిన్: 0.03 మి.గ్రా
  • విటమిన్ - సి: 18 మి.గ్రా

ఇంకా విటమిన్ - ఎ 80 I.U మరియు ఫోలిక్ యాసిడ్ 3 మైక్రోగ్రాముల చొప్పున ఉన్నాయి. వీటితోపాటు ఫ్రక్టోజ్, గ్లూకోజ్ మరియు షుగర్స్ కూడా ఇందులో లభిస్తాయి.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

నేరేడు పండులో పెక్టిన్ ఉంటుంది; ఇది విరేచనాలను తగ్గిస్తుంది. నేరేడు ఆకుల నుండి సుగంధ తైలం తీస్తారు. ఫలముల నుండి వైన్, జెల్లీలు, స్క్వాష్‌లు మరియు కాయల నుండి వెనిగర్‌ను తయారుచేస్తారు.

  • మధుమేహము: నేరేడు గింజల చూర్ణము 3 గ్రాములను రోజుకు 2 సార్లు సేవించిన మధుమేహము (Diabetes Mellitus) ను అదుపులో ఉంచుతుంది. దీనిని వాడటం వలన బ్లడ్ షుగర్ తగ్గుతుందని పరిశోధనలలో గమనించారు.
  • యాంటీ బ్యాక్టీరియల్: నేరేడు బెరడు, కాండము, ఆకులు, మొగ్గలు మరియు పువ్వుల నుండి తయారు చేసిన డికాక్షన్‌కు బ్యాక్టీరియాలను నిరోధించే గుణమున్నట్లు పరిశోధనలో తేలింది.
  • నోటిలోని పుండ్లు: నేరేడు ఆకులతో తయారుచేసిన డికాక్షన్‌ను నోటిలోకి తీసుకొని పుక్కిట పట్టి ఊచేసిన నోటిలోని పుండ్లు (అల్సర్స్) తగ్గుతాయి.
  • జిగురు విరేచనాలు: నేరేడు బెరడుతో తయారుచేసిన కషాయం అతిసారం మరియు జిగురు విరేచనాలను తగ్గిస్తుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 354, 355, 356)
  • రచయిత: డా|| టి. భిక్షపతి