అనాసపండు / Pineapple

From LTRC
అనాసపండు / Pineapple
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Liliopsida
Order Poales
Family Bromeliaceae
Genus Ananas
Scientific Name Ananas comosus (L.) Merr.

అనాసపండు (Pineapple) ప్రపంచమంతటా పెంచబడుతుంది. ఆయుర్వేదనందు దీనిని వాతపిత్తశామకము, బల్యము, ఆర్తవజననము, గర్భపాతకరం మరియు మూత్రలంగా చెప్పబడింది. ఇది మధురరసము, శీతవీర్యం, గురుస్నిగ్ధగుణము మరియు మధురవిపాకము అనే గుణ కర్మలను కలిగి ఉంది. దీనిని అశ్మరీ (మూత్ర పిండాల్లో రాళ్లు), మూత్రము కష్టంగా వెడలటం, రజోదోషము, కడుపునొప్పి, కామెర్లలో మరియు కష్టార్తవము నందు ఉపయోగిస్తారు. అనాస చాలా రుచిగా ఉంటుంది. అనాస పండులో దాదాపు 80 - 90 రకాలున్నాయి.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: అనాసపండు
  • సంస్కృతం: అనాసాస / బహునేత్ర
  • హిందీ: అనాసాస
  • ఇంగ్లీష్: Pine apple
  • లాటిన్: Ananas comosus Merr
  • కుటుంబము: Poromeliaceae (Bromeliaceae)

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల అనాస పండు నందు ఉండే పోషక విలువల వివరాలు:

  • కార్బోహైడ్రేట్లు: 12 గ్రాములు
  • ప్రోటీన్లు: 0.6 గ్రాములు
  • క్రొవ్వు: 0.1 గ్రాములు
  • కాల్షియం: 12 మి.గ్రా
  • పాస్పరస్: 10 గ్రా
  • ఐరన్: 0.42 మి.గ్రా
  • పొటాషియం: 247 మి.గ్రా
  • సోడియం: 1.6 మి.గ్రా
  • మెగ్నీషియం: 16.9 మి.గ్రా
  • క్లోరిన్: 28.5 మి.గ్రా
  • కాఫర్: 0.08 మి.గ్రా
  • విటమిన్ - ఎ: 60 I.U
  • విటమిన్ - బి1: 0.02 మి.గ్రా
  • విటమిన్ - బి2: 120 మైక్రోగ్రా
  • ఫోలిక్ యాసిడ్: 4 మి.గ్రా
  • పాంతోతినిక్ యాసిడ్: 0.17 మి.గ్రా
  • విటమిన్ - సి: 50 మి.గ్రా
  • ఆక్సాలిక్ యాసిడ్: 5.8 మి.గ్రా

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • దెబ్బలు తగిలి రక్తం కారుతుంటే: అనాస fresh Juice ను దెబ్బలు తగిలి రక్తం కారిన చోట రాసిన రక్తం కారటం ఆగిపోతుంది.
  • సిగరెట్లు తాగేవారికి: సిగరెట్లు తాగే వ్యక్తుల్లో విటమిన్ - సి లోపం కనిపిస్తుంది. అనాస జ్యూస్ తాగటం వలన ఈ సమస్య అధిగమించవచ్చు. సిగరెట్లు తాగటం వలన కలిగే దుష్పరిణామాలు తగ్గుతాయి.
  • మూత్రంలో మంట: అనాస జ్యూస్‌లో పొటాషియము ఎక్కువగా ఉంది. కిడ్నీవ్యాధి గ్రస్తులకు ఇది ఉపయోగకరం.
  • వేసవి తాపానికి: వేసవి తాపానికి అనాస జ్యూస్ మరియు పంచదార / గ్లూకోజ్ కలిపి తీసుకున్న యెడల నీరసం తగ్గి శక్తి కలుగుతుంది.
  • మలబద్ధకము: అనాస యందు fibre ఉంది. దీనివలన మలబద్ధకము తొలగి విరేచనం సాఫీగా అవుతుంది.
  • అజీర్ణము: అనాసయందు బ్రోమిలిన్ అనే ఎంజైము ఉంది. ఇది అజీర్ణమును తొలగిస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది.
  • రక్తమొలలు, వేవిళ్లు, రక్తహీనత: అనాస జ్యూస్ యందు మిరియాల పొడి కలిపి రోజుకు ఒక్కసారి తాగిన పైన చెప్పిన వ్యాధుల లక్షణాలు తగ్గుతాయి.
  • గజ్జి, తామర: అనాస జ్యూస్‌ను గజ్జి, తామర రోగుకు రాసిన దురద తగ్గిపోతుంది. చక్కని ఉపశమనము కలుగుతుంది.
  • ఇతర వ్యాధులు: గనేరియా, కామెర్లు, కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులతో బాధపడు రోగులు మందులు వాడుతూ అనాస జ్యూస్ తాగిన వ్యాధి లక్షణాలను తగ్గించటంలో ఎంతో సహకరిస్తుంది.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • అనాసను పండినప్పుడే తినాలి. పండనిది తిన్నయెడల నాలుక జిగురు జిగురుగా మారటంతో పాటు విరేచనాలు అవుతాయి. ఇది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇరిటెంట్గా పనిచేస్తుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 358, 359)
  • రచయిత: డా|| టి. భిక్షపతి