అనపకాయ / సొరకాయ (Bottle Gourd)
From LTRC
| శాస్త్రీయ వర్గీకరణ (Scientific Classification) | |
| రాజ్యము (Kingdom): | Plantae |
| విభాగము (Division): | Tracheophyta |
| తరగతి (Class): | Magnoliopsida |
| క్రమము (Order): | Cucurbitales |
| కుటుంబము (Family): | Cucurbitaceae |
| ప్రజాతి (Genus): | Lagenaria |
| శాస్త్రీయ నామం: | Lagenaria siceraria |
అనపకాయ లేదా సొరకాయ (Bottle Gourd) అనేది Cucurbitaceae (కుకుర్బిటేసి) కుటుంబానికి చెందిన ఒక ప్రముఖ కూరగాయల మొక్క. దీని శాస్త్రీయ నామం లాజినేరియా సిసిరేరియా (Lagenaria siceraria). పెరటి తోటల్లో అతిసులభంగా పెంచే కాయగూరల మొక్కల్లో ఇది ఒకటి. సాంబారులో సొరకాయ ముక్కలు వేసి తింటే చక్కని రుచిని ఆస్వాదించవచ్చు.
వివిధ భాషల్లో పేర్లు
- తెలుగు: అనపకాయ, సొరకాయ
- సంస్కృతం: మిష్టతుమ్బీ
- హిందీ: కద్దూ
- లాటిన్: లాజినేరియా సిసిరేరియా (మొతీనా) స్టాండల్
- కుటుంబము: Cucurbitaceae (కుకుర్బిటేసి)
పోషక విలువలు
అనపకాయ త్వరగా జీర్ణమయ్యే గుణాన్ని కలిగి ఉంటుంది.
ప్రతి 100 గ్రాముల సొరకాయలోని పోషకాలు:
- తేమ: 96.1 గ్రా
- శక్తి (కెలోరీలు): 12 కేలరీలు
- ప్రోటీన్లు: 0.5 గ్రా
- కొవ్వు: 0.1 గ్రా
- కార్బోహైడ్రేట్లు: 5 గ్రా
- ఫైబర్ (పీచు): 0.6 మి.గ్రా
- విటమిన్ - సి: 7 మి.గ్రా / 6 మి.గ్రా
- క్యాల్షియం: 443 మి.గ్రా
- మెగ్నీషియమ్: 87 మి.గ్రా
- సోడియం: 1.8 మి.గ్రా
- పొటాషియమ్: 8.7 మి.గ్రా
- ఖనిజలవణములు: 0.5 గ్రా
- సల్ఫర్: 10 మి.గ్రా
- ఫాస్పరస్: 10 మి.గ్రా
- థైమిన్: 0.03 మి.గ్రా
- కాఫర్: 0.3 మి.గ్రా
- రైబోఫ్లేవిన్: 0.01 మి.గ్రా
- నికోటినిక్ యాసిడ్: 0.2 మి.గ్రా
ఔషధ ఉపయోగాలు & ఆరోగ్య గుణాలు
- శరీరానికి చలువ: అనపకాయ శీత గుణము కలిగి ఉంటుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది.
- ధాతు వృద్ధి & హృదయ ఆరోగ్యం: వీర్యాన్ని, ధాతువులను వృద్ధి పరుస్తుంది. హృదయానికి బలాన్నిస్తుందని ఆయుర్వేద సంహితల్లో చెప్పబడింది.
- శీఘ్రస్కలనం: చేదు అనప సేవించడం వలన శీఘ్రస్కలనాన్ని నిరోధించవచ్చు.
- జీర్ణక్రియ & పైత్యం: ఇది మలబద్ధకాన్ని, పైత్యాన్ని తగ్గిస్తుంది. విరేచనాన్ని సాఫీగా రావటానికి సహకరిస్తుంది.
- అర్శమొలలు: ఇది అర్శమొలల (Piles) రోగులకు అత్యంత ఉపయోగకరంగా పనిచేస్తుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 341, 342)
- రచయిత: డా|| టి. భిక్షపతి
