అటుక మామిడి / Punarnava

From LTRC
అటుక మామిడి / Punarnava
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Magnoliopsida
Order Caryophyllales
Family Nyctaginaceae
Genus Boerhavia
Scientific Name Boerhavia diffusa L.

అటుక మామిడి (పునర్నవా) ఆంధ్రప్రదేశ్ అంతటా లభించే ఒక ముఖ్యమైన మూలికా మొక్క. దీని లేతాకులను పప్పులో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మరియు దీనిని కూరగా వండుకొని కూడా తింటారు. సాంప్రదాయ ఆయుర్వేదంలో ఇది వాపులను తగ్గించడానికి, కిడ్నీ వ్యాధులు మరియు కాలేయ సమస్యల నివారణకు విశేషంగా ఉపయోగపడుతుంది.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: అటుక మామిడి ; గలిజేరు
  • సంస్కృతం: పునర్నవా
  • లాటిన్: బోయెర్‌హావియా డిఫ్యూజా లిన్నెయిన్ (Boerhavia diffusa)
  • కుటుంబము: న్యిక్టాజినేసి (Nyctaginaceae)

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల అటుక మామిడిలో ఉండే పోషక విలువల వివరాలు:

  • తేమ: 91.3 గ్రాములు
  • ప్రోటీన్లు: 2.0 గ్రాములు
  • క్రొవ్వు: 0.4 గ్రాములు
  • కార్బోహైడ్రేట్లు: 3.2 గ్రాములు
  • ఫైబర్ (నార): 0.9 గ్రాములు
  • కాల్షియం: 100 మి.గ్రా
  • పాస్పరస్: 30 మి.గ్రా
  • ఐరన్: 38.5 మి.గ్రా
  • ఆస్కార్బిక్ యాసిడ్: 70 మి.గ్రా
  • కెరోటిన్: 2.3 మిల్లీ గ్రాములు

అదనంగా ఇందులో పున్నర్లీన్, సపోనిన్లు కూడా కలవు.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • పునర్నవా (Diuretic గుణం): శరీరంలో పేరుకుపోయిన సోడియంని బయటికి పంపించి వేస్తుంది. దీనివలన వాపులు తగ్గిపోతాయి. ఇది Diureticగా పనిచేస్తుందని పరిశోధనలో గమనించారు. పునర్నవా మూల క్వాధము నందు శుంటి కలిపి సేవించిన వాపు తగ్గును.
  • రక్తహీనత, బోదకాలు, కిడ్నీజబ్బులు: పునర్నవా కిడ్నీ జబ్బులతో బాధపడేవారికి (Nephroic Syndrome), బోదకాలు రోగాలతో పాటు రక్తహీనత రోగులకు అత్యంత ఉపయోగకరం.
  • రుమటాయిడ్ ఆర్థరైటిస్: పునర్నవా, శుంటి, గుగ్గులు సమాన పాళ్లలో కలిపి సేవించిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు కీళ్లజబ్బులు వ్యాధి లక్షణాలు తగ్గుతాయి.
  • కామెర్లు - జలోదరం (ఎసైటిస్): పునర్నవా కషాయం త్రాగడంవలన కామెర్లు, మరియు ఎసైటిస్ (జలోదరము) వ్యాధి లక్షణాలు తగ్గిపోతాయి.
  • రసాయనము: పునర్నవా మూలచూర్ణము 10-20గ్రా పాలతో సేవించిన రసాయనంగా పనిచేయును.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 350, 351)
  • రచయిత: డా|| టి. భిక్షపతి