అంజూరపండు (Fig)
| శాస్త్రీయ వర్గీకరణ (Scientific Classification) | |
| రాజ్యము (Kingdom): | Plantae |
| విభాగము (Division): | Tracheophyta |
| తరగతి (Class): | Magnoliopsida |
| క్రమము (Order): | Rosales |
| కుటుంబము (Family): | Urticaceae |
| ప్రజాతి (Genus): | Ficus |
| లాటిన్ పేరు: | Ficus carica |
అంజూరపండు (Fig) ప్రపంచమంతటా పెంచబడుతున్న ఒక ప్రముఖమైన పండ్ల మొక్క. దీని శాస్త్రీయ నామం ఫైకస్ కారికా (Ficus carica). వీటిని తాజా పండ్లుగా మరియు ఎండబెట్టి ఎండిన పండ్లుగా (Dry fruit) కూడా ఉపయోగిస్తారు. మార్కెట్‌లో వీటికి విపరీతమైన ధర పలుకుతుంది.
వివిధ భాషల్లో పేర్లు
- తెలుగు: మంచి మేడి, సీమఅత్తిపండ్లు
- సంస్కృతం: అంజూర
- హిందీ: అంజీర్
- లాటిన్: ఫైకస్ కారికా (Ficus carica)
- కుటుంబము: Urticaceae
పోషక విలువలు
అంజూర పండ్లు చాలా రుచిగా ఉంటాయి. ఇందులో సల్ఫర్, అమినో యాసిడ్స్ అయిన టైరోసిన్, లైపేజ్, ప్రోటీయేజ్, ప్రోటోజ్, క్రావిన్ మరియు లైసిన్లు లభిస్తాయి.
ప్రతి 100 గ్రాముల అంజూర పండ్లలో ఉండే పోషకాలు:
- కార్బోహైడ్రేట్లు: 17.1 గ్రా
- ప్రోటీన్: 1.3 గ్రా
- కొవ్వు: 2.0 గ్రా
- క్యాల్షియం: 8.3 గ్రా
- ఫాస్పరస్: 90 మి.గ్రా
- ఐరన్: 4.2 మి.గ్రా
- పొటాషియం: 10.15 మి.గ్రా
- సోడియం: 87.11 మి.గ్రా
- మెగ్నీషియం: 92 మి.గ్రా
- క్లోరిన్: 166 మి.గ్రా
- కాఫర్: 0.24 మి.గ్రా
- విటమిన్ - ఎ: 2070 I.U
- విటమిన్ - బి2: 50 మైక్రోగ్రామ్స్
- నియాసిన్: 0.3 మి.గ్రా
- విటమిన్ - సి: 2 మి.గ్రా
ఔషధ ఉపయోగాలు & ఆరోగ్య గుణాలు
1. విటమిన్ల లోపం: అంజూర పండ్లను పాలతో కలిపి తీసుకుంటే విటమిన్స్ లోపం వల్ల వచ్చే రోగాలు తగ్గుతాయి. 2. శరీర నిర్మాణం & చర్మ సౌందర్యం: చక్కని శరీర నిర్మాణానికి, గట్టి చిగుళ్ళు మరియు ఎముకల నిర్మాణానికి సహకరిస్తుంది. చర్మ సౌందర్యానికి కూడా ఇది ఎంతో అవసరం. 3. శ్వాస సంబంధ సమస్యలు: అంజూర పండ్లు మరియు తేనె కలిపి సేవించడం వల్ల టి.బి (రాజయక్ష్మ), దగ్గు (Bronchitis), ఆస్తమా వంటి రోగాలలో ఉపశమనం లభిస్తుంది. 4. ఇతర వ్యాధులు: రక్త అర్శమొలలు (Piles), మలబద్ధకం, సిర్రోసిస్ లివర్, కామెర్లు మొదలైన వ్యాధులలో ఎంతగానో ఉపయోగపడుతుంది. 5. పుండ్లు & ఎముకలు: అల్సర్లు మెల్లమెల్లగా మానుతాయి మరియు విరిగిన ఎముకలు అతుక్కోవడంలో సహాయపడతాయి. 6. మూత్ర సంబంధ వ్యాధులు: ఇందులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల మూత్రం కష్టంగా రావడం మరియు ఇతర మూత్ర సంబంధ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మేలు చేస్తుంది. 7. హృద్రోగాలు: హృద్రోగులకు (గుండె జబ్బు ఉన్నవారికి) అంజూర పండ్లు చాలా మంచివి. (వీరు డాక్టర్ల సలహాతో సేవించాలి). 8. పిల్లల ఆరోగ్యం: అనేక పోషక విలువలు ఉన్నందున పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉండి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. 9. రక్తహీనత: ఇందులో ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత (Anemia) బాధితులకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. 10. వాణిజ్య ఉత్పత్తులు: అంజూర పండ్లతో జెల్లీలు, జాములతో పాటు కొన్ని రకాల వైన్స్ కూడా తయారుచేస్తున్నారు.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 337, 338, 339)
- రచయిత: డా|| టి. భిక్షపతి
